Ishant Sharma made sensational comments saying that Mahendra Singh Dhoni is not cool, he barks in anger
మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఈ పేరు క్రికెట్ లో ఒక బ్రాండ్. ప్రపంచంలో ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని లేడు. అభిమానులు మిస్టర్ కూల్(Mr Cool) అని ప్రేమగా పిలుచుకుంటారు. క్రికెట్ లో సచిన్ తరువాత మళ్లీ అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న వ్యక్తిగా మహేంద్ర సింగ్ ధోని చరిత్రలో నిలిచిపోతాడు. క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యర్థుల నుంచి ఎంత ఒత్తిడి నెలకొన్నా ఎప్పుడూ కూల్ గా కనిపించే ధోని పై టీమ్ ఇండియా ఫాస్ట్ బౌల్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) తీవ్ర విమర్షలు చేశాడు. బయటికి కూల్ గా కనిపించే ధోని గ్రౌండ్ లో అందరిని బూతులు తిడుతాడని(Scolds), ఇషాంత్ ను కూడా అనేక సార్లు బూతులు తిట్టాడని చెప్పుకొచ్చాడు.
మహీ భాయ్ కి చాలా బలాలున్నాయి. కానీ, కూల్ ఉండడం అనేది ఆ జాబితాలో లేదు. అతడు గ్రౌండ్ లో ఎప్పుడూ బూతులు మాట్లాడుతాడు. ఎన్నో సార్లు నన్ను కూడా తిట్టాడు. చాలా కోపం(Anger)గా కూడా ఉంటాడని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్(IPL match) అయినా లేక అంతర్జాతీయ క్రికెట్ అయినా ధోనీ చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. అతనితో ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఇది మనం అనేక సార్లు టీవీల్లో చూసే ఉంటాము. నేను ప్రత్యక్షంగా చూశాను. ఓ సారి నేను బౌలింగ్ స్పెల్ పూర్తి అయిన తర్వాత నువ్వు చాలా అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు అని అడిగాడు. ఏదో పలకరింపుగా అడిగాడు అనుకొని అవును భాయ్ అని సమాధానం ఇచ్చాను. అంతే నీకు వయసైపోయింది, ఇక రిటైర్ అయిపో అన్నాడు. ఆ మాటలకు నేను షాక్ కి గురియ్యా అని ఇషాంత్ తెలిపారు.
ధోనీ మైదానంలో ఒత్తిడి వలన టీమ్ పై తరుచు ఆగ్రహం ప్రదర్శిస్తుంటాడని, ఆ కోపానికి ఇషాంత్ కూడా కొన్ని సందర్భాలలో బలి అయినట్లు తెలిపారు. ఒక టెస్టు మ్యాచ్లో త్రో సరిగ్గా పట్టుకోలేకపోయినందుకు కోపంగా చూశాడని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. ఓ సారి మహీ భాయ్ విసిరిన త్రోను సరిగ్గా అందుకోలేకపోయాను. అప్పుడు కోపంగా చూశాడు. రెండోసారి బలంగా బాల్ విసిరాడు. దాన్ని కూడా పట్టుకోలేకపోయాను. మూడో త్రో వేసేటప్పుడు తల బాదుకో అని గట్టిగా అరిచాడు అని ధోనీ కోపం గురించి ఇషాంత్ శర్మ తెలిపారు. టీమ్ కు ఆయన అంటే ఎంత గౌరవం ఉంటుందో అంతే భయం కూడా ఉంటుందని ఇషాంట్ తెలిపారు.
చదవండి:Singer Coco Lee : విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత