అత్యంత ఖరీదైన పెళ్లి చేసుకొని ఒక జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను వధువు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
ముస్లింల పండుగల సెలవులను పెంచి..హిందూ పండుగలకు సెలవులను తగ్గించారు. నితీష్ కుమార్ బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 2024 సెలవుల క్యాలెండర్‌ను ప్రకటించిన క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తన రెండో భార్య సాక్షి కూడా సంతకం పెట్టారు. అయితే వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ప్రకృతి సృష్టించిన ఈ సుందర ప్రపంచాన్ని మనిషి తన స్వార్థం వల్ల పాడు చేసుకున్నాడు. మనుషులకు అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభిస్తాయి.
పవన్ కళ్యాణ్‌పై ఓ వ్యక్తి చెప్పు దాడికి యత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అది ఇప్పటి వీడియో కాదని, కొందరు కావాలనే పవన్ కళ్యాణ్‌పై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని జనసైనికులు హెచ్చరించారు.
సచివాలయం ముందు ఓ యువకుడు స్కూటీతో ఫీట్ చేశాడు. బైక్‌తో 16 సెకన్ల పాటు విన్యాసాలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ని ఫ్రీగా వదిలేయడానికే ఇష్టపడతారు. కానీ వంట చేసే సమయంలో మాత్రం జుట్టు అలా వదిలేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సాక్ష్యం ఇదే. తాజాగా ఓ మహిళ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు.
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే వార్తలు కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని నోరు తెరిచేలా చేస్తాయి. అద్దె ఇళ్ల గురించి తెలిసిందే. ఏరియాను బట్టి రేట్లు ఉంటాయి. కానీ ఈ అద్దె రూమ్‌లో బెడ్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పెంచుకున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించడం ట్రెండ్ గా మారుతుంది. వాటిలో శునకాలు, పిల్లి, గాడిద, గుర్రం వంటి వాటికి ఇప్పటికే జరుపగా..ఆ జాబితాలో తాజాగా కోడి కూడా చేరింది. అవునండి బాబు ఇటివల కోడిపుంజుకు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
గేట్ వే ఆఫ్ ఇండియా ముందు గల సముద్రంలో ఇద్దరు వ్యక్తులు చెత్త పడేశారు. ఆ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
ఇద్దరు మహిళలు కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒకే బిడ్డను ఇద్దరు మహిళలు తమ కడుపులో ఎలా మోశారని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వలింగ సంపర్కులైన ఆ జంట ఫెర్టిలిసీ సెంటర్ ద్వారా మగబిడ్డకు జన్మనివ్వడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. టైలర్ స్విప్ట్ పేరు బదులు బ్రిట్నీ అంటూ పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బైడెన్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
బిలియనీర్ బిల్ గేట్స్ మురుగు కాలువ లోనికి వెళ్లారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో నిన్న భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆస్ట్రేలియన్ కెప్టెన్, పాట్ కమ్మిన్స్ మిచెల్ మార్ష్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.