Viral News: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఖర్చు ఎంతో తెలుసా?
అత్యంత ఖరీదైన పెళ్లి చేసుకొని ఒక జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను వధువు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
Viral News: ధనవంతుల పెళ్లిళ్లు వైభవంగా జరుగుతాయి. సౌత్ ఫ్లోరిడా (South Florida)కు చెందిన ఓ వివాహం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అయింది. వందల కోట్లను తమ వివాహాం కోసం ఖర్చు చేసి, వేడుక మొత్తాన్ని డాక్యుమెంటరీ చేయించారు. దానిని వధువు మడేలైన్ బ్రాక్వే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సౌత్ ఫ్లోరిడాకు చెందిన కార్ డీలర్షిప్ తన కూతురు మడేలైన్ బ్రాక్వే పెళ్లి ఘనంగా నిర్వహించాడు. 59 మిలియన్ డాలర్లను ఖర్చు చేశాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు.
26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే(madelainebrockway), జాకబ్ లాగ్రోన్తో గత మూడు ఏళ్ల నుంచి ప్రేమలో ఉంది. వీరి వివాహానికి వధువు తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు ఘనంగా పెళ్లి జరిపించాడు. సంగీత్ ప్రారంభం నుంచి వీడ్కోలు పలికే వరకు ఉన్న ఈ వీడియో డాక్యుమెంటరీ అందరిని ఆకర్షించింది. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రి పూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియోలో ఉన్నాయి. ఈఫిల్ టవర్ కనపడేలా ఉన్న గార్డెన్లో వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. వరుడు లాగ్రోన్ లింక్డ్ఇన్ కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇండియాలో కూడా ఇలాంటి ఖరీదైన పెళ్లీలు చూశాము. గతంలో కర్ణాటక మాజీ మంత్రి తన కూతురు పెళ్ళి కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు అప్పట్లో వార్తులు వచ్చాయి.