»After Rajamouli Hero Mahesh Babu With Star Director Sandeep Reddy Vanga
Rajamouli తర్వాత.. స్టార్ డైరెక్టర్‌తో మహేష్ బాబు?
ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి రాజమౌళి తర్వాత మహేష్ బాబును డైరెక్ట్ చేసేదేవరు?
After Rajamouli hero Mahesh Babu with star director sandeep reddy vanga
జస్ట్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు. కానీ ఎస్ఎస్ఎంబీ 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు జక్కన్న. లేటెస్ట్గా జరిగిన యానిమల్ ఈవెంట్లో ఎస్ఎస్ఎంబీ 29 ఊసే ఎత్తలేదు. కానీ మహేష్, రాజమౌళి ఇద్దరు ఒకే స్టేజీ మీద కనబడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. సందీప్ రెడ్డి కోసం ఇద్దరు ఈవెంట్‌కి వచ్చి యానిమల్ హైప్‌ని మరింత పెంచారు. అయితే మహేష్ బాబు ఈ ఈవెంట్‌కి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. రాజమౌళి తర్వాత మహేష్‌ను డైరెక్ట్ చేసేదెవరు? అనేది చాలా రోజులుగా చర్చ జరుగుతునే ఉంది.
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు లైన్లో ఉన్నాయి. కానీ మహేష్ బాబు ‘యానిమల్’ ఈవెంట్‌కు రావడంతో ఎస్ఎస్ఎంబి 30(ssmb30) డైరెక్టర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని చెప్పొచ్చు. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగ(sandeep reddy vanga)తో మహేష్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యానిమల్ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయనున్నాడు సందీప్. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నాడు సందీప్. అప్పటి వరకు మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కానుంది.
ఈ లెక్కన మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబో ఫిక్స్ అయినట్టే. పైగా అర్జున్ రెడ్డి తర్వాత మహేష్(mahesh babu)తో సినిమా ప్లాన్ చేశాడు సందీప్. కానీ కుదరలేదు. ఖచ్చితంగా మహేష్‌తో వైలెంట్ సినిమా చేస్తానని.. అది డెవిల్లా ఉంటుందని.. యానిమల్(animal) ప్రమోషన్స్‌లో భాగంగా చెబుతున్నాడు సందీప్. కాబట్టి రాజమౌళి తర్వాత మహేష్‌ను డైరెక్ట్ చేసేది సందీప్ రెడ్డినే అని చెప్పొచ్చు.