స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.
ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్లో(poland) జరిగింది.
అంబానీ(mukesh ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. ఇక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ అంబానీ కోడలు శ్లోకా మెహతా వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ధరకు ఐదు వందల లగ్జరీ బంగ్లాలు కొన్నట్లే.
కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.
విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బీహార్‌లోని పూర్నియాలోని బన్‌మంఖి సబ్‌డివిజన్‌లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్‌తో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుండి కూడా ఈ జాతరకు వస్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
మధుస్మిత మాంచెస్టర్‌లో జరిగిన మారథాన్‌లో పాల్గొంది. 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. సోషల్ మీడియాలో జనాలు మధుస్మితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కట్టుకున్న చీర చాలా ప్రత్యేకమైంది. ఒడిశా ప్రజలు దానిని ఒడియా సంస్కృతి ప్రతిబింబేందుకు ఈ చీర ధరిస్తారు.
పక్కింటికి వెళ్లాల్సిన ఓ వ్యక్తి(Black teenager)..తన ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టాడని ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. ఆ యువకుడిపై రెండు రౌండ్ల కాల్పులు(gun shooting) జరిపాడు. ఈ ఘటన ఇటీవల అగ్రరాజ్యం అమెరికా(USA Kansas City)లో జరిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు సైతం స్పందించారు.
ఏప్రిల్ 20వ తేదిన హైబ్రిడ్ సూర్యగ్రహణాలు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
నటి, ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్‌ను టీటీడీ విడుదల చేసింది.