Mizoram: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరాం
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్‌లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియా(india)లోనే అంత్యంత సంతోషకరమైన రాష్ట్రం(happiest state)గా మిజోరాం(Mizoram) నిలిచింది. గురుగ్రామ్‌లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ పిలానియా నిర్వహించిన సర్వే ప్రకారం ప్రకటించారు. అయితే ఈ నివేదిక ప్రకారం 100 శాతం అక్షరాస్యత సాధించడంలో భారతదేశంలో మిజోరాం రెండో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు విద్యనభ్యసించడంతోపాటు అభివృద్ధి చెందడానికి అవకాశాలను దక్కించుకుంటారని పేర్కొంది.
కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందంపై COVID-19 ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యంతో సహా ఆరు పారామితులపై నివేదికను రూపొందించారు.
మిజోరాంలోని ఐజ్వాల్‌లోని ప్రభుత్వ మిజో హైస్కూల్ (GMHS) విద్యార్థి, తన తండ్రి చిన్నతనంలో తన కుటుంబాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ అతను ఆశాజనకంగా ఉన్నాడు. అంతేకాదు ఆ విద్యార్థి చదువులో కూడా రాణించడం విశేషం.
అదేవిధంగా GMHSలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. అతని తండ్రి పాల ఫ్యాక్టరీలో పని చేస్తాడు. అతని తల్లి గృహిణి. ఈ క్రమంలో వారి చదువు కారణంగా తమ అవకాశాలపై ఆశతో ఉన్నారని రిపోర్టు చెబుతోంది.
మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు, మేము వారితో ఏదైనా పంచుకోవడానికి భయపడమని విద్యార్థులు(students) చెబుతున్నారు. మిజోరాంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి క్రమం తప్పకుండా భేటీ అవుతున్నట్లు తెలిసింది. అంతేకాదు చదువుల పట్ల తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిజో కమ్యూనిటీలోని ప్రతి బిడ్డ లింగ భేదం లేకుండా ముందుగానే సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది.
అక్కడి ప్రజలు ఏ పనిని కూడా చాలా చిన్నదిగా పరిగణించరు. యువత సాధారణంగా 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో ఉపాధి(job)ని వెతుక్కుంటారు. దీంతోపాటు బాలికలు, అబ్బాయిల మధ్య ఎటువంటి వివక్ష ఉండదని నివేదిక స్పష్టం చేసింది. ఇలా అనేక అంశాల్లో సానుకూలత ఉన్న క్రమంలో ఈ రాష్ట్రం దేశంలో సంతోషకర రాష్ట్రంగా నిలిచింది.