బీహార్‌లోని పూర్నియాలోని బన్మంఖి సబ్‌డివిజన్‌లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్‌తో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుండి కూడా ఈ జాతరకు వస్తారు.
Patta Mela : పెళ్లి అనేది జీవితంలో మధుర ఘట్టం. పెళ్లి(marriage) అనగానే పెద్దలు ఏడు తరాలు చూడాలంటారు. భారతదేశంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిలో మొదటి ఘట్టం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. కొన్నిసార్లు జీవిత భాగస్వామి కుటుంబ పరిచయాల ద్వారా తారసపడతారు. ప్రస్తుతం మాట్రిమోనీ సైట్లలో తనకు సరిపోయే భాగస్వామిని పెళ్లికాని వారు ఎంచుకుంటున్నారు. భారతదేశంలో వివాహానికి సంబంధించి అనేక ఆచారాలు, సంప్రదాయాలు(tradition) ఉన్నాయి. బీహార్‌లోనూ ఇదే సంప్రదాయం ఉంది. దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వివాహ సంప్రదాయాన్ని ఆ రాష్ట్రంలో పాటిస్తారు. బీహార్(Bihar)లోని పూర్నియా(purnia)లో అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకునే జాతర ఉంది. ఈ జాతరను పట్టా మేళా(patta mela) అంటారు. ఇక్కడ అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయికి పాన్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారు.
బీహార్‌లోని పూర్నియాలోని బన్మంఖి సబ్‌డివిజన్‌లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్‌తో పాటు పశ్చిమ బెంగాల్(west bengal), జార్ఖండ్, నేపాల్(Nepal) నుండి కూడా ఈ జాతరకు వస్తారు. ఈ సమ్మేళనం ప్రతేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించబడుతుంది. ప్రధానంగా దీనిని గిరిజనులు నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే అబ్బాయిలు, అమ్మాయిలు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు. జాతరకు వచ్చిన అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయికి పాన్(Pan) ఇచ్చి పెళ్లి ప్రపోజ్(Propose) చేస్తారు. ఆ అమ్మాయి పాన్ తింటే ఆమె కూడా అబ్బాయిని ప్రేమిస్తోందని అర్థం.
జాతరలో అబ్బాయి ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత, అమ్మాయి కుటుంబ సభ్యుల అంగీకారంతో అబ్బాయితో ఆమె వెళుతుంది. దీని తరువాత ఇరు కుటుంబాల సమక్షంలో అబ్బాయి, అమ్మాయి గిరిజన ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంటారు. జాతరకు వచ్చే అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఆకు తినిపించేవాడని జాతర నిర్వాహకుల్లో ఒకరైన మాజీ సర్పంచ్(Surpunch) చెప్పారు. అమ్మాయి ఆకు తింటే పెళ్లికి సిద్ధమని, తినకపోతే అబ్బాయి ఇష్టం లేదని అర్థం. తన జీవితంలో ఇప్పటివరకు ఎందరో అబ్బాయిలు, అమ్మాయిలు ఈ జాతరలో పెళ్లి చేసుకోవడం చూశానని మాజీ సర్పంచ్ చెబుతున్నాడు. పెళ్లికి అబ్బాయి, అమ్మాయి ఒక షరతును అంగీకరించాలి. దానికి అనుగుణంగానే గిరిజన సంప్రదాయం ప్రకారం వారికి పెళ్లి అవుతుంది. ఈ వివాహ సమయంలో ప్రకృతిని తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. జాతరలో ఎవరైనా ప్రేమలో పడి పెళ్లికి నిరాకరిస్తే గిరిజన సంఘం చట్టాల ప్రకారం శిక్షిస్తారు.