ADB: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఇంద్రవెల్లిలో చోటుచేసుకుంది. ఉట్నూరు బస్సు డిపో నుంచి ఆదిలాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో యువకునికి తీవ్ర గాయాల పాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయాలైన యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.