KKD: కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో గిరి ప్రదక్షిణకు భక్తులు లక్షల్లో తరలివచ్చారు. ‘నేల ఈనిందా, ఆకాశం విరుచుకుపడిందా’ అన్న స్థాయిలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 2:30 గంటలకు మరోసారి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసినప్పటికీ, సమన్వయ లోపం ఉందని ఆరోపిస్తూ భక్తులు ఈవోపై విమర్శలు చేస్తున్నారు.