ప్రస్తుతం ట్విట్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు మావాడు సరిగ్గా కన్సట్రేట్ చేయలేదు గానీ.. సూటు, బూటు వేస్తే.. ఎవ్వరైనా దిగదుడుపే అంటూ సంబరపడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. యంగ్ టైగర్ కాస్త స్టైలిష్ టైగర్‌గా మారిపోయాడని అంటున్నారు. ఆస్కార్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఫ్యాన్స్‌తో కలిసి రచ్చ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇంటర్య్వూలు, ఫోటో షూట్లతో సందడి చేస్తున్నాడు. తాజాగా యంగ్ టైగర్ చాలా స్టైలిష్‌గా మేకోవర్ అయ్యాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇందులో యంగ్ టైగర్ సాలిడ్ లుక్‌తో అదరగొట్టాడు. బ్లూ కలర్ సూట్లో రాయల్ లుక్‌లో కనిస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఆ ఫోటోలను అలా అప్లోడ్ చేయడమే లేట్ అన్నట్టు.. తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. #ManOfMassesNTR.. #NTRAtOscars.. #NTRGoesGlobal అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అబ్బా.. ఏం ఉన్నాడ్రా బాబు అన్నయ్య.. This Tiger is Ready to Hunt, Stylish Tiger, స్టైలిష్ తారక్, అన్న స్టైల్ అదిరిపోయింది, రాయల్ లుక్ అంటే ఇది.. అంటూ ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. దాంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇక ఆస్కార్ ఈవెంట్ అయిపోగానే.. ఎన్టీఆర్ 30ని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. మార్చి 18న ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ 30లో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.