»Not The Vatican City But This Is The Smallest Country In The World
Smallest Country: ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న దేశం ఇదే..!
వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాన్ని సీలాండ్ అంటారు. పేరు సూచించినట్లుగా ఇది అన్ని వైపులా సముద్రంతో చుట్టుముట్టి ఉన్న భూమి. వాటికన్ సిటీ ఒక చిన్న దేశం, కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ సీలాండ్ను అలా గుర్తింపు దక్కలేదు. అందుకే దీనిని ఎవరూ గుర్తించలేదు. కానీ నిజానికి చిన్న దేశం అంటే ఇదే.
అధికారికంగా ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్, వాటికన్ కన్నా పరిమాణం లో చాలా చిన్నది. ఈ దేశం ఇంగ్లాండ్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 27 మంది మాత్రమే నివసిస్తున్నారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి చిన్న దేశం అంటారు. ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్’ ప్రపంచంలోని రెండు వందల దేశాలలో ఒకటి. ఇది 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇంగ్లాండ్ ఉత్తర సముద్రంలో ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి సొంత సైన్యం, జెండా, కరెన్సీ ఉంది. కానీ ఈ దేశానికి ప్రధాని లేడు. ఆ దేశం రాజు, రాణి పాలిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇంగ్లాండ్ ఈ స్థలాన్ని ఉపయోగించుకుంది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
ఎప్పుడు నిర్మించారు?
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సీలాండ్ను బ్రిటిష్ వారు నిర్మించారు. ఇది సైన్యం, నావికా కోటగా ఉపయోగించారు. ఇది UK వెలుపల ఉంది కాబట్టి ఇది యుద్ధం తర్వాత కూల్చివేయాలి అనుకున్నారట. కానీ కూల్చలేదట. రెండవ ప్రపంచ యుద్ధం సమయం 1943లో, UK ప్రభుత్వం ఇక్కడ మౌన్సెల్ కోటలను నిర్మించింది. ఇవి ప్రాథమికంగా సమీపంలోని ఈస్ట్యూరీలలోని ముఖ్యమైన షిప్పింగ్ లేన్లకు వ్యతిరేకంగా రక్షణగా ఉపయోగించబడుతున్నాయి. ఇది జర్మన్ మిన్క్రాఫ్ట్కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంది. ఈ మౌన్సెల్ కోటలు 1956లో రద్దు చేశారు.