Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.
మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి. నాలుగు గోడల మధ్య సెటిల్ అవాల్సిన వ్యవహారం.. ఇప్పుడు నలుగురిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ అన్నదమ్ముల గొడవకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది.. ఎందుకు గొడవ పడ్డారు.. అనే విషయాలు ఖచ్చితంగా తెలియకపోయినా.. ఈ మ్యాటర్ మాత్రం ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. రాజకీయంగాను హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సి విషయం ఏంటంటే.. కొంత కాలంగా రీల్ లైఫ్‌లో సత్తా చాటలేకపోతున్న మంచు బ్రదర్స్.. రియల్ లైఫ్ పరంగానే వార్తల్లో నిలుస్తున్నారు. కానీ మరోవైపు హీరోలుగా ఉన్న ఈ జనరేషన్ అన్నదమ్ములు.. సినిమాల పరంగా దూసుకుపోతున్నారు. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, మెగా ఫ్యామిలలను తీసుకుంటే.. బ్రదర్స్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను చూస్తే.. ఇది కదా అన్నదమ్ముల బాండింగ్ అనేలా ఉంటుంది. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ కూడా ఈ విషయంలో పర్ఫెక్ట్. దగ్గుబాటి ఫ్యామిలీలో రానా, అభిరాం కూడా ఇలాంటి విషయాల్లో ఎక్కడా కనిపించరు. ఇక మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలున్నా.. ఇలాంటి సందర్భాలు ఫేజ్ చేయలేదు. కానీ విష్ణు, మనోజ్ మాత్రం చేజేతులా తమను తాము డ్యామేజ్ చేసేసుకుంటున్నారు. హీరోలుగా కూడా రేసులో వెనకబడిపోయారు. మనోజ్ సినిమాలకు దూరమై చాలా కాలం అవుతోంది. విష్ణు సినిమాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. మొత్తంగా రీల్ లైఫ్‌లో సత్తా చాటుతారనుకున్న మంచు బ్రదర్స్, వ్యక్తిగత విషయాలను నలుగురిలో పెట్టడం.. ఇండస్ట్రీలో గౌరవంగా ఉన్న మోహన్ బాబుకు మనస్తాపం కలిగించినట్టే. మరి ఇప్పటికైనా మంచు బ్రదర్స్.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటారేమో చూడాలి.