»Mba Chai Wala Prafull Billore Buys Mercedes Benz Suv Car
Prafull Billore బెంజ్ కారు కొన్న చాయ్ కొట్టు కుర్రాడు.. అతడి కథేంటో తెలుసా..?
వారానికి ఆరు రోజులు పని.. ఒక్క రోజు విరామం.. అత్తెసరు జీతం. సెలవుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మాకు కుదరని తమ ప్రతిభకు పదును పెట్టి వ్యాపార రంగంలోకి దూకుతున్నారు. తమ ప్రతిభకు తోడు సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించి యువత సత్తా చాటుతోంది. ఉద్యోగం చేయడం కాదు తామే నలుగురికి ఉద్యోగమిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఏమాత్రం నామోషీ పడకుండా కింద స్థాయి నుంచే కష్ట పడుతున్నారు. విజయం కోసం ఎన్నాళ్లయినా ఎదురుచూస్తున్నారు.
యువత ధోరణి మారుతోంది. చదువు తర్వాత ఉద్యోగంలో స్థిరపడాలని భావించడం లేదు. వారానికి ఆరు రోజులు పని.. ఒక్క రోజు విరామం.. అత్తెసరు జీతం. సెలవుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మాకు కుదరని తమ ప్రతిభకు పదును పెట్టి వ్యాపార రంగంలోకి దూకుతున్నారు. తమ ప్రతిభకు తోడు సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించి యువత సత్తా చాటుతోంది. ఉద్యోగం చేయడం కాదు తామే నలుగురికి ఉద్యోగమిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఏమాత్రం నామోషీ పడకుండా కింద స్థాయి నుంచే కష్ట పడుతున్నారు. విజయం కోసం ఎన్నాళ్లయినా ఎదురుచూస్తున్నారు. సొంతంగా తమ కాళ్లపై వాళ్లు నిలబడి కోటీశ్వర్లు అవుతున్నారు. అలాంటి కోవలోకే చెందుతాడు గుజరాత్ కు చెందిన చాయ్ వాలా. చాయ్ అమ్ముతూనే ఇప్పుడు అత్యంత విలాసవంతమైన బెంజ్ కారు (Mercedes Benz) కొనుగోలు చేయడం వైరల్ గా మారింది.
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ (27) (Prafull Billore) ఎంబీఏ చదువును మధ్యలోనే వదిలేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అహ్మదాబాద్ లోని ఐఐఎం వద్ద చాయ్ దుకాణం (Tea Stall) తెరిచాడు. ఎలాగో ఎంబీఏ (MBA) పట్టా రాలేదు కనుక దాన్నే ఎంబీఏ చాయ్ వాలా (MBA Chai wala) అనే పేరుతో చిన్నగా హోటల్ తెరిచాడు. చాయ్ రుచిగా ఉండడంతో ఐఐఎం విద్యార్థులు మెచ్చుకున్నారు. క్రమేణా అతడి హోటల్ కు డిమాండ్ పెరిగింది. చాయ్ తో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు అందిస్తూ వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఎంబీఏ చాయ్ వాలాకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇలాంటి చాయ్ వాలా కేంద్రాలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా మంచి స్పందన రావడంతో ఇక స్టార్టప్ గా ఎంబీఏ చాయ్ వాలాను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రఫుల్ చాయ్ కేంద్రాలు నెలకొల్పాడు. పెట్టిన ప్రతి చోట అద్భుతంగా చాయ్ కేంద్రాలు (Tea Stalls) నడుస్తుండడంతో అతడి వ్యాపారం వృద్ధి చెందింది. ఇక ఎంబీఏ చాయ్ వాలా బ్రాండ్ మార్మోగిపోయింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.
యువతకు ప్రఫుల్ బిల్లోర్ ఐకాన్ గా మారాడు. ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 1.5 మిలియన్ల మంది ఫాలోవుతున్నారు. ఆరేళ్లలోనే కోట్లకు పడగలెత్తాడు. తాజాగా ప్రఫుల్ మెర్సిడెస్ ప్రీమియమ్ బెంజ్ (Mercedes GLE 300d SUV) కారును కొనుగోలు చేశాడు. ఆ కారు విలువ దాదాపు రూ.90 లక్షలు. కారు కొన్న విషయాన్ని తన సోషల్ మీడియాలో పంచుకోగా ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఒక చిన్న టీ స్టాల్ నుంచి ఇంత స్థాయికి ఎదగడంపై అందరూ అభినందిస్తున్నారు. కాగా ప్రఫుల్ తనలాంటి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు.
శిక్షణనిచ్చి ఉపాధి పొందేలా చేస్తున్నాడు. దీనికోసం ఎంబీఏ చాయ్ వాలా అకాడమీని ప్రారంభించాడు. ఆ అకాడమీలో వ్యాపారంలో ప్రత్యేక కోర్సుకు బోధిస్తున్నాడు. దీంతోపాటు మోటివేషనల్ స్పీకర్ ప్రఫుల్ అవతరించాడు. పెద్ద పెద్ద కళాశాలలు, విద్యాసంస్థలకు వెళ్లి అవగాహన సదస్సుల్లో పాల్గొని యువతలో స్ఫూర్తి నింపే ప్రసంగాలు చేస్తున్నాడు. తన విజయంతో ప్రఫుల్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.