అమ్మాయిలా చీర కట్టుకుని హోయలు పోతూ డ్యాన్స్ చేశాడు ఓ యువకుడు. అతని శరీరం అమ్మాయిలా ఉండి గడ్డం మీసాలు ఉండటం..అందులోనూ అమ్మాయిలా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
భారత లెజండరీ సింగర్ ఆశా భోంస్లే (Asha Bhosle) తాను పాడిన అనేక పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. అవి ప్రతీ ఒక్కరికి డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగిస్తాయి. 2002లో విడుదలైన మేరే యార్ కి షాదీ హై (Mere Yaar Ki Shaadi Hai) చిత్రంలోని షరారా అటువంటి పాటే. ఈ పాట విడుదలైనప్పటి నుంచి చాలా మంది దాని రెండిషన్‌లను సృష్టించారు. కొందరు కొరియోగ్రఫర్లు కూడా ఈ పాటకు డాన్స్ చేశారు.
ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన మరో కొరియోగ్రఫీ డాన్స్ వైరల్‌గా మారింది. వీడియోలో ఓ వ్యక్తి చీర కట్టుకుని ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. డ్యాన్సర్ అమిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో, అతను టెర్రస్‌పై నిలబడి ఆకుపచ్చ రంగు చీరను ధరించడాన్ని మీరు చూడవచ్చు. పాట ప్లే అయిన తర్వాత, అతను దానికి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అతని డ్యాన్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు.
ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుంచి ఇది 24 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. షేర్‌కి అనేక లైక్‌లు, కామెంట్లు కూడా వచ్చాయి. చాలా మంది అతని నటనను ఇష్టపడ్డారు, మెచ్చుకుంటున్నారు కూడా.
కొందరు నెటిజన్లు ఈ విధంగా స్పందించారు. ఒక వ్యక్తి “ప్రతిభ” super అని రాశారు. మరొకరు, “అతను ఎంత సజావుగా డ్యాన్స్ చేస్తున్నాడు” అని తెలిపాడు. సదరు వీడియోకు క్లాప్ ఎమోజీని జోడించాడు. మూడవవాడు “వావ్, వాట్ ఎ డాన్స్” అని పంచుకున్నారు.