School Video: ప్రీ స్కూల్స్లో పిల్లల్ని ఉంచుతున్నారా? షాకింగ్ వీడియో
నేటి కార్పొరేట్ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలా మంది తమ పిల్లల్ని ప్రీ స్కూల్స్ లో పడేసి వెళ్తున్నారు. అయితే ఆ స్కూల్స్ జరిగే విషయాలను, పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బాలుడు మరో బాలుడ్ని చితక బాదిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ సిబ్బంది పట్టించుకోకపోవడం, పిల్లల్ని సరిగా చూడకపోవడంతో తల్లిదండ్రులు ఇకనైనా అలర్ట్ అవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రీ స్కూల్స్(Pre Schools)లో పిల్లల్ని వదిలివెళ్లే తల్లిదండ్రులకు అలర్ట్. ప్రీ స్కూల్ అంటే పిల్లల్ని సంరక్షించేదిగా ఉండాలి కానీ అక్కడ మాత్రం పిల్లలకు భద్రత లేదు. చాలా విద్యా సంస్థలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరు(Bengaluru)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Video Viral) అవుతోంది.
ప్రీ స్కూల్ వీడియో వైరల్:
A disturbing video of a preschool where toddlers are left unattended in a closed room. A senior kid is seen hitting repeatedly a junior school. Please think once before sending your’s kids to this kind of School🙏pic.twitter.com/7ovmq7dWn0
బెంగళూరు(Bengaluru)లోని ఓ ప్రీ స్కూల్(Pre Schools)లో ఓ బాలుడు మరో పిల్లాడ్ని దారుణంగా కొట్టాడు. చుట్టూ బొమ్మలు, పిల్లల గుంపులతో ఉన్న గదిలో ఓ మహిళ ఓ పిల్లాడ్ని తీసుకుని బయటకు వెళ్లిపోయింది. మిగిలిన వారిని ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఆ సమయంలో గదిలో ఉన్న ఓ బాలుడు మరో పిల్లాడ్ని దారుణంగా కొట్టాడు. పెద్దవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో రెచ్చిపోయి ఆ పిల్లాడ్ని చితకబాదాడు. బెంగళూరులోని టెండర్ఫోర్ట్ మాంటిస్సోరి స్కూల్(TenderFort Mantissory school)లో ఈ సంఘటన జరిగింది.
బాలుడ్ని చితకబాదుతున్న వీడియో:
పిల్లలకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవ్వడంతో తల్లిదండ్రులు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. కొట్టిన ఆ చిన్నారి, అతని తల్లిదండ్రులపై విచారణ చేయాలని, బాలుడి మానసిక పరిస్థితిని పరిశీలించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ స్కూల్స్(Pre Schools), ప్లే స్కూల్స్ లో పిల్లల్ని వదిలి వెళ్లకుండా తమ కుటుంబీకుల వద్దే పిల్లల్ని ఉంచాలని మరికొందరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం పిల్లల వీడియో వైరల్ అవుతోంది.