ఉల్టా స్కూటర్ ను ఎక్కడైనా చుశారా? లేదా అయితే ఇక్కడ చూసేయండి. ఓ యువకుడు కొత్తగా తయారుచేయించిన ఈ స్కూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. రోడ్లపై కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎలా ఉందో చుద్దాం రండి.
Indonesia, the Ulta scooter is going viral on social media
Ulta scooter: బుర్రకో బుద్ధి, జిహ్వాకో రుచి అన్నట్లు ఓ కుర్రాడు చేసిన వినూత్న అవిష్కరణ(innovation)కు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు అని నిరుపించాడు ఈ ఇండోనేషియా కుర్రాడు. ప్రస్తుతం సమాజంలో ఎంత ప్రత్యేకంగా ఉంటే అంత గుర్తింపు దక్కేలా లేదు. అందుకే అరఫ్ అబ్దురెహమాన్ ఇప్పుడు ప్రపంచానికే ఓ స్పెషల్ పర్సన్. తన సృజనాత్మకత(Creativity)తో చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. మాములుగా స్కూటర్ అనగానే మనకు ఒక రూపం ఉహల్లోకి వస్తుంది. ఇక ఇతను తయారు చేసిన స్కూటర్‌ను ఒక్క సారి చూశాకా, అసలు స్కూటర్లు (scooter) ఇలా కూడా ఉంటాయా అనిపించక మానదు. అందుకు కారణం తన వాహానం ఉల్టా(Ulta scooter)గా ఉంటుంది. ముందు భాగంలో కూర్చొని వెనుక వైపు యాక్సిలెటర్ అమర్చి నడిపేలా డిజైన్ చేశాడు. అది చూడడానికి రివర్స్ లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అందుకనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాములుగా ద్విచక్ర(Bike) వాహనాలను రీమోడలింగ్ చేస్తూ చాలా మంది తిరుగుతుంటారు. అంటే ఒక బైక్‌కు సంబంధించిన పరికరాలను మరో వాహనానికి అమరుస్తారు. అవి చూడాడానికి అంత ఆసక్తిగా కనిపిస్తే ఇక రివర్స్‌లో వెళ్తుంది అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇండోనేషియా(Indonesia)లో అరఫ్ అబ్దురెహమాన్ ఈ కొత్తరకమైన వాహనాన్ని డిజైన్ చేసి రోడ్డపై నడుపుతుండగా మరో వ్యక్తి దీన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక మిగతా వాహనదారులు కూడా దీన్ని చూసి నోర్లు తెరిచి చూస్తున్నారు. అయితే ఇలాంటి వింతైనవి రోడ్లపై రావడం సదరు ప్రయాణిలకు శ్రేయస్కారం కాదని, ఇలాంటివి అనుమతించకూడదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.