»Hardik Pandya And Natasa Stankovic To Marry Again On Valentines Day
Hardik Pandya : మరోసారి పెళ్లి చేసుకుంటున్న హార్దిక్ పాండ్యా..!
Hardik Pandya : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోనున్నాడు. తన భార్యనే ఆయన రెండోసారి ఈ వాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకుంటున్నాడు. కరోనా సమయం మొదటి సారి వీరిద్దరి పెళ్లి జరిగింది. ఒక అబ్బాయిని కన్నారు. ప్రస్తుతం కరోనా భయం పూర్తిగా పోవడం భారీస్థాయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని తన ముచ్చట తీర్చుకోనున్నాడు.
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోనున్నాడు. తన భార్యనే ఆయన రెండోసారి ఈ వాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకుంటున్నాడు. కరోనా సమయం మొదటి సారి వీరిద్దరి పెళ్లి జరిగింది. ఒక అబ్బాయిని కన్నారు. ప్రస్తుతం కరోనా భయం పూర్తిగా పోవడం భారీస్థాయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని తన ముచ్చట తీర్చుకోనున్నాడు.
ఉదయ్ పూర్ లో హార్ధిక్ పాండ్యా పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా కుమారుడు అగస్త్య , హార్ధిక్ పాండ్యా భార్య నటాషా స్కాన్కోవిచ్ ఉదయ్ పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత మీడియాకు చిక్కారు. సెర్బియా మోడల్ అయిన నటాషా స్కాన్కోవిచ్ ను హార్ధిక్ పాండ్యా 2020లో వివాహం చేసుకున్నాడు.
కరోనా సమయం కావడంతో చాలా సాదాసీదాగా పెళ్లి తంతు ముగిసింది. ఈ సారి మరపురాని రీతిలో పెళ్లి చేసుకుని ముచ్చట తీర్చుకోవాలని భావించారు. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. అదే విధంగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. 2022 జనవరి 1 వ తేదీన హార్ధిక్ పాండ్యా నటాషాల ఎంగేజ్ మెంట్ జరిగింది. మే 31న వివాహం జరిగింది. జులై నెలలో ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. వివాహం జరిగే నాటికే ఆమె గర్భవతి కావడం విశేషం.