Halar Donkey Baby Showers In Rajkot: గాడిదలకు సామూహిక సీమంతం
సాధారణంగా మనం గర్భిణుల(Pregnent Womens)కు సీమంత వేడుక చేయడం చూసుంటాం. కుటుంబీకుల మధ్య సీమంతం వేడుక వైభవంగా జరుపుతారు. ఈ మధ్య ప్రభుత్వ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతం వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతులు అయితే తమ పెంపుడు ఆవులకు సీమంతం చేసిన సందర్భాలున్నాయి. అయితే గాడిదల(Donkeys)కు సీమంతం చేయడం ఇప్పటి వరకూ ఎక్కడా చూసుండరు. కానీ ఇక్కడ మాత్రం గాడిద(Donkey)లకు సామూహిక సీమంతం చేశారు.

గుజరాత్(Gujarat)లో గాడిద(Donkeys)లకు సీమంతం చేయడమే కాకుండా వాటి పిల్లలకు బారసాలను కూడా చేస్తున్నారు. వారు అలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. రాష్ట్రంలోని రాజ్ కోట్(Rajkot)లో గాడిద(Donkeys)లకు సామూహిక సీమంతాలు చేసిన ఘటన ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. ఈ ప్రాంతంలో హలరీ(Halar) జాతికి చెందిన గాడిదలంటే చాలా ఫేమస్. ఆ గాడిదలు(Donkeys) ఎక్కువ పనిచేస్తాయి. అలాగే ఎంత దూరమైన అలసట లేకుండా ప్రయాణిస్తాయి. అయితే ఈమధ్య హలరీ జాతి గాడిదలు క్రమేణా అంతరించిపోతున్నాయి.
ప్రస్తుతం పాల కోసం మాత్రమే ఈ హలరీ జాతి గాడిద(Halari Donkeys)లను పెంచుతున్నారు. ఈ జాతి గాడిదలను కాపాడటం కోసం ప్రజలు నడుం బిగించారు. కోల్కి గ్రామంలో ఈ జాతి గాడిద(Donkeys)లను ప్రత్యేకంగా పెంచుతూ వస్తున్నారు. పుట్టిన గాడిద పిల్లలకు బారసాల(Donkey Baby Showers) చేస్తున్నారు. అలాగే గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం చేస్తున్నారు. ఇటీవలే 33 గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు.
హలరీ జాతి గాడిద(Halari Donkeys)లకు మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సామూహిక సీమంతం వేడుకలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఈ సామూహిక సీమంతం వేడుకలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హలరీ గాడిదల(Halari Donkeys) సంఖ్య సుమారు 417 ఉన్నట్లు సమాచారం. వీటిని కాపాడేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.