»Delhi Hc Dismisses Petitions Challenging Agnipath Scheme
Agnipath scheme: అగ్నిపథ్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీమ్ పైన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ స్కీమ్ చెల్లుబాటును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ఈ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్నిసవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం చెల్లుబాటును సోమవారం సమర్థించింది. అగ్ని పథం స్కీంలో జోక్యం చేసుకోవడానికి గల కారణాలు ఏవీ కనిపించడం లేదని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీమ్ (Agnipath scheme) పైన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పును వెలువరించింది. ఈ స్కీమ్ చెల్లుబాటును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (Court) సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ఈ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని(agneepath recruitment scheme) సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ (Indian Army) కోసం కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం చెల్లుబాటును సోమవారం సమర్థించింది. అగ్ని పథం స్కీంలో జోక్యం చేసుకోవడానికి గల కారణాలు ఏవీ కనిపించడం లేదని తెలిపింది. ఇది దేశం కోసం తీసుకున్న నిర్ణయంగా స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ 15న తన ఆదేశాలను రిజర్వ్ చేసింది హైకోర్టు.
అగ్నిపథ్ స్కీంను (Agnipath scheme) గత ఏడాది జూన్ నెల 14వ తేదన ప్రకటించారు. సాయుధ దళాలలో యువకుల రిక్రూట్మెంట్ కోసం నియమాలను నిర్దేశించింది ఈ స్కీమ్. దీనిని కేంద్రం తీసుకు వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు సవరించింది కేంద్రం. 2022 సంవత్సరం జూలై నెలలో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ, దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదలీ చేసింది. కేరళ, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పెండింగులో ఉన్న అగ్ని పథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదలీ చేయాలని లేదా నిర్ణయం వెలువడే వరకు పెండింగులో ఉంచాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 27) ఢిల్లీ హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.
అగ్నిపథ్ స్కీమ్ భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీరులు అని పిలుస్తారు. 2022 జూన్ 14 న భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకాన్ని 2022 సెప్టెంబర్ నుండి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా త్రివిధ దళాలలోకి, ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. ఈ అగ్నివీర్ అనేది కొత్త సైనిక ర్యాంకు. అగ్నిపథ్ స్కీమ్ కు ముందు ముందు, సైనికులు జీవితకాల పెన్షన్‌తో 15 సంవత్సరాలకు లేదా అంతకంటే ఎక్కువ పైబడిన పదవీ కాలంపై సాయుధ దళాలలో నియమించేవారు. రిటైరయ్యాక వీరికి జీవితాంతం పెన్షన్ వచ్చేది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019 నుంచి మూడేళ్ల పాటు సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్ జరగలేదు. ఓ వైపు ప్రతి సంవత్సరం 50 వేల నుండి 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తున్నారు. మరోవైపు మానవ వనరుల కొరత ఏర్పడి, సాయుధ దలాల కార్యాచరణ సామర్థ్యాలను ప్రభావితం చేసే పరిస్థితికి దారి తీసింది. ఆ తర్వాత అగ్నిపథ్ ను తీసుకు వచ్చారు.