Shocking Video: మీరు హిప్పోపొటామస్ని చూశారా.. ప్రస్తుతం అవి మన దేశంలో జంతు ప్రదర్శన శాల(ZOO)లలో మాత్రమే కనిపిస్తాయి. అయితే చాలా దేశాలలో ఈ పెద్ద జంతువులు నదులు, చెరువులలో కూడా కనిపిస్తాయి. ఈ జంతువులు చూడడానికి ఏనుగుల వలె భారీగా ఉంటాయి. కానీ అవి నీటిలో నివసిస్తాయి. ఈ జంతువులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాస్తవానికి అవి చాలా దూకుడుగా, ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఆ సమయంలో అవకాశం దొరికితే వెంటనే ఎవరిపైనైనా దాడి చేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ వీడియోలో హిప్పోల సమూహం ప్రమాదకరమైన మొసలిపై దాడి చేయడం కనిపిస్తుంది. మొసలి ఒంటరిగా ఉన్నందున హిప్పోలు కలిసి మొసలిని ఆటాడుకుంటున్నాయి. ప్రాణాల కోసం చాలా పోరాడింది మొసలి.. ఎలాగోలా వాటినుంచి ప్రాణాలతో తప్పించుకోగలిగింది. హిప్పోపొటామస్ మొసలిని ఎలా కొరికే ప్రయత్నం చేస్తుందో, ఎలా ఎత్తుకుపోతుందో వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో మొసలి నొప్పితో మూలుగుతోంది. ఈ దృశ్యం మనసును హత్తుకుంటుంది. వన్యప్రాణులకు సంబంధించిన ఈ ప్రమాదకరమైన వీడియో వైల్డ్లైఫ్మోర్ అనే ఐడీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 2 లక్షల 76 వేల వ్యూస్ రాబట్టింది. అంతేకాకుండా సుమారు ఏడు వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు.