»Elephant Stops Truck On Highway To Grab Some Sugarcane In Viral Video
Elephant stops truck: రోడ్డుపై ట్రక్కును ఆపి, చెరుకు తీసుకున్న ఏనుగు
ఓ ఏనుకు (elephant) చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీని ఆపి మరీ (elephant stopping a truck), చెరుకును (sugarcanes) తీసుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఓ ఏనుకు (elephant) చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీని ఆపి మరీ (elephant stopping a truck), చెరుకును (sugarcanes) తీసుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్ (social media user), ఐ రెడ్అండ్ ఐ ఫౌండర్ డాక్టర్ అజయిత తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. రోడ్డు పైన వెళ్తున్న లారీని ఆపి మరీ చెరుకు తీసుకున్న ఏనుగును టోల్ ట్యాక్స్ కలెక్టర్ (The Toll Tax collector) అంటూ సరదాగా క్యాప్షన్ (caption) పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1200కు పైగా రీట్వీట్లు, దాదాపు ఏడువేల లైక్స్ వచ్చాయి. 2.37 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.
భారత్ లో అనేక జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నో ఇతర దేశాల కంటే మన వద్ద జంతువులు ఎక్కువగా సంరక్షించబడతాయి. అటవీ ప్రాంతాలలో మనుషులు, జంతువుల మధ్య అప్పుడప్పుడు ఆసక్తికర చర్యలు చోటు చేసుకుంటాయి. ఇలాంటిదే ఈ వీడియో. అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది స్పష్టంగా తెలియరాలేదు. చెరుకు గడల (sugarcanes) లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కును రోడ్డు దాటే క్రమంలో చూసిన ఏనుగు.. అడ్డగించే ప్రయత్నం చేస్తుంది. దీంతో సదరు డ్రైవర్ ఆ ట్రక్కును కాస్త పక్కకు అని ఆపుతాడు. ముందు నిలబడి ట్రక్కును ఆపిన ఆ ఏనుగు అందులోని చెరుకు గడల నుండి కొన్నింటిని తన తొండంతో రోడ్డు పైన వేసుకుంటుంది. అలా ఒకటికి మించి ట్రక్కులను ఆపి, వాటి నుండి చెరుకును తీసుకుంటుంది.
ఇది చదవండి: Congress showers money: డ్యాన్సర్‌పై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత
ఇప్పుడు ఈ వీడియో (Video) నెటిజన్లను (Netizens) కట్టి పడేస్తోంది. ట్విట్టరిటీస్… తమదైన శైలిలో స్పందించారు. ‘సో క్యూట్’, ‘బడా ఇమాన్ దార్ కలెక్టర్ ఉన్నది గా’, ‘వంద శాతం టోల్ ట్యాక్స్ (Toll Tax) వసూలు చేయడానికి అర్హురాలు ఈ ఏనుగు’, ‘ఫారెస్ట్ ట్యాక్స్’ (Forest Tax), ‘ఏనుగు తనకు ఎంత అవసరమో అంతే తీసుకుంది.. గుడ్’, ‘వావ్.. అద్భుతంగా ఉంది’, ‘డ్రైవర్ చాలా మౌనంగా ఏనుగుకు ట్యాక్స్ చెల్లించాడు’, ‘కేవలం సుగర్ కేన్ ట్రక్ నుండి మాత్రమే ట్యాక్స్’ అంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ… సుగర్ కేన్ లోని చక్కెర కంటెంట్ ను తనిఖీ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ సెల్ (Quality Control Cell) అక్కడ జంబోను (ఏనుగును) మోహరించిందని చమత్కరించాడు.
ఈ వీడియో ఎక్కడ, ఏ ప్రాంతమో స్పష్టంగా తెలియనప్పటికీ, అందులో మాత్రం జాగ్రత్త… ఏనుగులు రోడ్డు దాటే ప్రాంతం (Caution Elephant Crossing) అంటూ బోర్డు ఉంది. ఇది ఏదైనా అడవిలోని ఓ ముఖ్య రోడ్డు అయి ఉంటుంది. థాయ్ లాండ్ (Thailand) దేశంలోని వీడియోగా (Viral Video) భావిస్తున్నారు.