Fadnavis భావొద్వేగం.. దివ్యాంగురాలి కళ్లలో కాంతి కనిపించిందట, ఏం చేసిందంటే..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ భావొద్వేగానికి గురయ్యారు. దివ్యాంగురాలైన ఓ యువతి కాలి వేతిలో నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చిందని తెలిపారు. ఆమె కళ్లలో ఓ మెరుపు చూశానని వివరించారు.
Fadnavis: మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఉద్వేగానికి గురయ్యారు. జలగావ్ ప్రాంతంలో దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అంతా దివ్యాంగులే.. వారితో గడిపారు. ఓ యువతి ఫడ్నవీస్‌కు కాలి బొటనవేలితో తిలకం దిద్దారు. ఆ తర్వాత హారతి కూడా ఇచ్చారు. ఆ ఘటనను గుర్తుకు చేస్తూ ట్వీట్ చేస్తూ.. ఉద్వేగానికి గురయ్యారు.
‘తనకు ఇప్పటివరకు తల్లులు, సోదరీలు ఆశీర్వాదం ఇచ్చారు. వారి నుంచి తిలకం స్వీకరించాను. హారతి కూడా తీసుకున్నాను. ఈ రోజు ఓ సోదరి బొటనవేలితో నుదుట మీద తిలకం దిద్దింది. మునపటిలా అదీ చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు.. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఉద్వేగానికి గురిచేస్తాయి. ఆ సోదరి తిలకం దిద్ది, హారతి ఇచ్చింది. తన మొహంలో చిరునవ్వు, కళ్లలో మెరుపు కనిపించింది అని’ ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాసుకొచ్చారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @Dev_Fadnavis తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. pic.twitter.com/4nh3DsRfaI
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 28, 2023
‘ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. ఎవరి జాలి, దయ అవసరం లేదు. కఠిన పరిస్థితులను దాటుకొని వెళ్తాను అని ఆ మెరుపును చూస్తే అనిపించింది. ఆ సోదరి ప్రతీ పోరాటంలో అండగా ఉంటాను అని’ ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రకటించారు.