»Anand Mahindra Gives Strong Counter To International Media Anchors Comments On Indias Successful Chandrayaan 3
Anand Mahindra: యాంకర్‌కు..ఆనంద్ మహీంద్రా గట్టి కౌంటర్
అంతార్జాతీయ మీడియా యాంకర్ భారతదేశం విజయం సాధించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Anand Mahindra gives strong counter to international media anchor's comments on India's successful Chandrayaan-3
Anand Mahindra: భారతదేశం చేపట్టిన చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగం విజవంతం అయిన సందర్భంగా ఇప్పుడు ప్రపంచమే మన దేశాన్ని కీర్తిస్తోంది. అన్ని దేశాలు ఇండియా సాధించిన ఘనతపై చర్చలు జరుపుతున్నాయి. అయితే ఏం సాధించినా అందులో మంచికి బదులు చెడును ప్రచారం చేసే కొన్ని శక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వారు చేయలేనిది మరొకరు చేస్తే తట్టుకోలేరు. బదులుగా బురదజల్లి అల్ప సంతోషం వ్యక్త పరుస్తుంటారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సందర్భంగా ఇస్రో (ISRO) చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్ చర్చా చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో గురించి సదరు యాకంర్ తప్పుగా మాట్లాడారు. దీనికి బదులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిమ్మతిరిగే సమాధానమిచ్చారు.
Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ
చంద్రయాన్-3 విజయంతో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. మిగతా దేశాలు కూడా భారత్ సక్సెస్‌ను స్వాగతీస్తూ అభినందిస్తున్న వేలా ఒక ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్ చర్చాకార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎంతో మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. మౌలిక సదుపాయాల అందరికి అందించడంలో ఆ దేశం వెనుకంజలోనే ఉంది. దాదాపు 70 కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఇలాంటప్పుడు వేల కోట్లు ఖర్చుపెట్టి అంతరిక్ష పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందా అని చర్చలో పాల్గొన్న వ్యక్తిని యాంకర్ ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఆనంద్ మహీంద్రా గట్టిగానే స్పందించారు.
మీరు చెబుతుంది నిజమే.. మమ్మిల్ని పేదవాళ్లను చేసింది. 200 ఏళ్ల దోపిడి పాలన. అంతే కాదు ఒక ప్రణాళికాతో భారత్‌ను దోచుకున్నారు. కేవలం కోహినూర్ డైమెండ్(Kohinoor Diamond)ను మాత్రమే కాదు. మా శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దొంగిలించారు. కేవలం ఆంగ్ల పాలకుల వలన దేశ ప్రజలను ఆత్మన్యూనతకు గురిచేశారు. అయినా టాయిలేట్లకు, అంతరిక్షపరిశోధనలకు మూడిపెట్టడాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదని తెలిపారు.
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేయడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధిరిస్తోంది. విజ్ఞాన రంగంలో పురోగతిని సాధించేందుకు మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికాన్ని జయించాలనే బలమైన సంకల్పం ఏర్పడుతోంది. నిజమైన పేదరికం మన ఆలోచనల్లోనే ఉంటుందని మహీంద్రా రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మహీంద్రా (Anand Mahindra)కు మద్దతుగా నిలబడుతున్నారు. భారతదేశాన్ని చూసి సదరు మీడియా ఈర్ష్య పడుతుందని పేర్కొంటున్నారు.