»500 Crore Wedding One Of The Most Expensive Weddings In India
Ex Minister Janardhana Reddy : మంత్రిగారి కూతురి పెళ్లంటే మినిమమ్ ఉంటది మరి…!
Ex Minister Janardhana Reddy : కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. మరి ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
గొప్పోళ్ల పెళ్లిళ్లు ఎప్పుడూ గ్రాండ్ గానే జరుగుతాయి. కోట్లు ఖర్చుపెట్టి వివాహ వేడుక జరిపిస్తారు. తాజాగా ఓ మంత్రి తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు. తక్కువలో తక్కువ రూ.500కోట్లు ఖర్చుపెట్టాడు. కేవలం పెళ్లి బట్టలు, నగలు, మేకప్ కే రూ.500కోట్లు ఖర్చు చేశాడంటే నమ్మగలరా..? నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం.
కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. మరి ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
50 వేల మందికి పైగా అతిథులు హాజరైన ఈ ఐదు రోజుల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికల్లో ఎల్సిడి స్క్రీన్లు అమర్చిమరీ ఇచ్చాడు. పెళ్లిపత్రికగా ఇచ్చిన బాక్స్ లో ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. టేప్ విప్పగానే పాట ప్లే అవుతుంది.
రెడ్డి కుటుంబం పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎద్దుల బండ్లలో గేటుదాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు డిజైన్ చేశారు.
పెళ్లికి వచ్చిన అతిథులను తరలించేందుకు దాదాపు 2000 క్యాబ్‌లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను నియమించారు.
మంత్రి జనార్ధన రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాజుల వేషధారణలతో కోట్లాది రూపాయల విలువైన బంగారు, డైమండ్ నగలు ధరించి వచ్చారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.పెళ్లిలో బంగారు దారంతో నేసిన రూ.17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర వధువు బ్రాహ్మణి ధరించింది. ఇక ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.90 కోట్లు.