ఇండియన్స్(Indians) ఎక్కువగా దోసె(Dosa)ను ఇష్టపడతారు. మసాలా దోసె, ఉప్మా దోసె, రవ్వ దోసె ఇలా అన్ని రకాల దోసెలను ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు పాన్ దోసె పేరు(Pan Dosa) నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విచిత్ర కాంబినేషన్ ఏంటని ఆహారప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియోను @happyfeet_286 అనే ట్విట్టర్(Twitter) యూజర్ షేర్ చేశారు.
వీడియోలో తమలపాకుల(Betel Leaves)తో సిద్ధం చేసిన పిండితో ఓ వ్యక్తి దోసె(Dosa)లు వేస్తున్నాడు. ఆ తర్వాత ఆ దోసెపై వెన్న, తరిగిన పాన్, ఎండు ద్రాక్ష, ఆఫ్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, డ్రైఫ్రూట్స్(Dry Fruits) వంటివన్నీ వేసి పేస్ట్‌లా చేశాడు. వాటన్నింటితో పాన్ దోసె(Pan Dosa) రెడీ చేశాడు. ఈ విచిత్రమైన కాంబినేషన్‌కు జనాలు మండిపడుతున్నారు. గ్రహాన్ని వదిలిపెట్టి వెళ్లే టైం దగ్గరపడిందనే శీర్షికతో ఆ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.