»Sharmila Reacts On Ysr Statue Vandalised At Avutapur
sharmila on ysr statue vandalize:ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా.. ఖంత్రివా..! షర్మిల ఫైర్
sharmila on ysr statue vandalize:అవుతాపూర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా విగ్రహాం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేశారు. ఇదీ బీఆర్ఎస్ గూండాలు చేసిన పని అని షర్మిల అన్నారు.
sharmila reacts on ysr statue vandalised at avutapur
sharmila on ysr statue vandalize:అవుతాపూర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని (ysr statue) దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా విగ్రహాం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని (statue) అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేశారు. ఇదీ బీఆర్ఎస్ (brs) గూండాలు చేసిన పని అని షర్మిల (sharmila) అన్నారు. దయలేని దయాకర్ రావు (dayakar rao) దగ్గరుండి మరీ చేయించిన ఘాతుకం అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని పడగొట్టిన గూండాలకు నాయకుడు ఆయన అని షర్మిల (sharmila) విమర్శించారు. మహిళలు చలిమంటలు వేసుకొని కట్టించిన విగ్రహాంపై మొదటి నుంచే మంత్రికి కన్ను పడిందని చెప్పారు.
చదవండి:Bhupalpally రేవంత్ యాత్రలో ఉద్రిక్తత.. కోడిగుడ్లు, టమాటాలు, సీసాలతో దాడి
విగ్రహా ఏర్పాటును అడ్డగించేందుకు శతకోటి ప్రయత్నాలు చేశాడని షర్మిల (sharmila) గుర్తుచేశారు. విగ్రహాం ఏర్పాటు చేయాలని ముందుండి నిలబడ్డ మహిళలకు (women) పథకాలు బంద్ చేస్తానని బెదిరించాడని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహం నిలిచే సరికి మంత్రి ఎర్రబెల్లికి (errabelli dayakar rao) నిద్రపట్టలేదని చెప్పారు. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న వైఎస్ఆర్ అభిమానాన్ని తట్టుకోలేకపోయాడని మండిపడ్డారు. అర్థరాత్రి గూండాలను పెట్టి జేసీబీలతో (jcb) ధ్వంసం చేయించాడని ఆరోపించారు. ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా.. ఖంత్రివా..! అని షర్మిల విరుచుకుపడ్డారు.
చదవండి:kodandaram:మార్చి 10న తెలంగాణ బచావో.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ
అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల (statues) మీద రాజకీయం? అంటూ షర్మిల ధ్వజమెత్తారు. పాలకుర్తి (palakurthy), చెన్నూరు (chennur) రిజర్వాయర్లు నిర్మించడం చేతకాలేదు.. కానీ విగ్రహాలు (statues) మాత్రం ధ్వంసం చేయొచ్చు అని ఫైరయ్యారు. డిగ్రీ కాలేజీ (degree college) కూడా తెచ్చుకోలేని అసమర్థ మంత్రివి అని మండిపడ్డారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉండి, బీరు బాటిళ్లు (beer), బ్రాండి (brandi) బాటిళ్లు అమ్ముకో అని చెప్పిన సన్నాసిని అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే…విగ్రహాలను పడగొట్టడం మీదున్న సోయి అభివృద్ధి మీద ఎక్కడుంటద్నారు. మంత్రివే అయితే.. నీ పేరులో దయ (daya) ఉంటే వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి నిర్మించి.. నిజాయతీ నిరూపించుకో అని సవాల్ విసిరారు. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతామని షర్మిల అన్నారు.
అవుతాపూర్ లో మహానేత విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య. అర్ధరాత్రి బీఆర్ఎస్ గూండాలు చేసిన పని ఇది. దయలేని దయాకర్ రావు దగ్గరుండి మరీ చేయించిన ఘాతుకం ఇది. విగ్రహాన్ని పడగొట్టిన గూండాలకు నాయకుడు ఈ ఎర్రబెల్లి. స్వయంగా మహిళలు చలిమంట వేసుకొని కట్టించిన విగ్రహంపై.. 1/5 pic.twitter.com/GHCKLOQCkZ