క్రికెట్ మ్యాచ్‌లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
తెలంగాణలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరికొన్ని చోట్ల ప్రజలు గల్లంతు కాగా, ఇంకొన్ని చోట్లు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నాయి. విద్యార్థుల దృష్ట్యా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ఓ అందమైన పల్లెటూరులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు జీవిత కథాంశంతో వస్తోన్న సినిమా కృష్ణగాడు అంటే ఒక రేంజ్. కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఓ వైపు తన తండ్రి కోరికను నెరవేర్చడం, మరో వైపు ప్రేమను గెలవడం..ఇలాంటి సవాళ్ల మధ్య కృష్ణ పోరాట తీరును సినిమాలో చూపించారు.