టాలీవుడ్ (Tollywood) హీరో దగ్గుబాటి రానా (Rana) ఇటీవలె అమెరికాలోని కామిక్ కాన్ ఈవెంట్లో హిరణ్య కశ్యప(Hiranyakashyap) ఫస్ట్ లుక్‌ను విడుదల(First Look Release) చేశారు. ప్రముఖ కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ నుంచి తీసుకున్న కథతో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas) ఈ సినిమా స్టోరీ రాస్తున్నారు. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ (Concept Teaser Release) చేశారు. కార్టూన్ రూపంలో హిరణ్య కశ్యపుడి (Hiranyakashyap) ఫోటోల రూపంలో ఉన్న వీడియోను రానా సోషల్ మీడియాలో షేర్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిరణ్య కశ్యపుడిగా రానా(Daggubati Rana) లుక్ అదిరిపోయింది. రాక్షస రాజు పాత్రలో రానా లుక్ (Rana Look) అందర్నీ కట్టిపడేస్తోంది.
కఠోరమైన తపస్సును హిరణ్య కశ్యపుడు (Hiranyakashyap) ఎందుకు చేశాడనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ కాన్సెప్ట్ టీజర్ (Concept Teaser)కి రానా ‘ రాక్షస రాజు ఆగమనం’ అంటూ క్యాప్షన్ ఇచ్చి వీడియోను విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్ నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.