తెలంగాణలో ఎకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ గ్రామం(Moranchapalli vilalge) పూర్తిగా నీట మునిగింది. దాదాపు 200 ఇళ్లలోకి నీరు చేరింది. ఈ క్రమంలో నలుగురు గల్లైంతైనట్లు తెలుస్తోంది. తమకు ఎవరైనా సాయం అందించాలని ఇళ్లపైకి ఎక్కి కోరుతున్నారు. మరికొంత మంది చెట్లు ఎక్కి ఆయా ప్రాంతాల్లోని వారు తమను తాము కాపాడుకుంటున్నారు.
విషయం తెలిసిన సీఎం కేసీఆర్ ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంత ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్ పంపాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(MLA gandra venkataramana reddy) హుటాహుటిన మోరంచపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. స్థానికులతోపాటు అధికారులతో మాట్లాడి చేపట్టాల్సిన చర్యల గురించి ఆరా తీశారు. మరోవైపు ఈ ప్రాంతంలో వరద ప్రవాహం గురించి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.