నంది విగ్రహం నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందికి నీళ్లు తాగించడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది అక్కడికి చేరుకుని క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా(russia) ఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ “మెగా స్లంప్”(మంచు బిలం) కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇటివల హిమాచల్ ప్రదేశ్‌లో వరదల వీడియోలు గత వారం బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి యావత్ దేశం షాక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా గుజరాత్(gujarat)లో కూడా వర్షాల వరదలతో సంచలన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వరదల్లో కార్లు, బైకులు సహా గ్యాస్ సిలిండర్లు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.
తమిళ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. పేరుకు ఆయన తమిళ నటుడు అయినప్పటికీ, ఆయనకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. సూర్య నుంచి మూవీ వస్తోందంటే చాలు ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతుంటారు. కాగా, తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా కంగువా మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. త్రివిక్రమ్ మాటలు అందించగా సముద్రఖని దర్శకత్వం వహించారు.
ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
క్రైమె థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో రూపొందించిన తాజా చిత్రం హెచ్ఇఆర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు నచ్చిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.