నంది విగ్రహం నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందికి నీళ్లు తాగించడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది అక్కడికి చేరుకుని క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ(Telangana)లోని నిర్మల్ జిల్లా(Nirmal District)లో వింత ఘటన జరిగింది. ఓ ఆలయంలో నందీశ్వరుడు నీళ్లు తాగాడు. దీనికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. జూలై 22 రాత్రి నుంచి నంది విగ్రహం నీళ్లు తాగుతోన్నట్లు భక్తులు(Devotees) చెప్పుకుంటున్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది తరలి వస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది.
నీళ్లు తాగుతున్న నంది విగ్రహం వీడియో:
ఆలయానికి చేరుకున్న భక్తులు(Devotees) నంది(Nandi) విగ్రహానికి నీళ్లు తాపేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతుండగా భక్తులు శివ నామాలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో నంది విగ్రహం నీళ్లు తాగుతున్నట్లు కొందరు భక్తులు(Devotees) గుర్తించారు. నీళ్లు తాగడం గమనించి మరి కొన్ని నీళ్లు నందీశ్వరుడికి తాగించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో నంది విగ్రహం నీళ్లు తాగుతుందన్న వార్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఆలయానికి అందరూ క్యూ కడుతున్నారు. వానల్పాడ్, పాండ్రిగల్లి, పులే నగర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని నంది విగ్రహాలకు ఆయా గ్రామస్తులు నీళ్లు తాగించేందుకు పోటీపడుతున్నారు.