»1 12 Lakh Gastroenteritis Cases Of Contaminated Water In The Telangana
Telangana:లో కలుషిత నీటితో 1.12 లక్షల కేసులు
తెలంగాణ(telangana)లో ట్యాప్ వాటర్(water) తాగుతున్నారా? అయితే జాగ్రత్త. కచ్చితంగా ఈ నీటిని వేడి చేసుకుని తాగండి. ఎందుకంటే గత ఆరు నెలల్లో రాష్ట్రంలో సరఫరా అవుతున్న నీటిని తాగి లక్ష మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే మరి అసలు అనాధికారికంగా ఎంత మంది ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.
తెలంగాణ(telangana)లో కలుషిత నీటి(water) కారణంగా అనేక మంది పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై 19 వరకు(ఆరు నెలల్లోనే) రాష్ట్రంలో 1.12 లక్షల మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు మరికొంత మంది మృత్యువాత కూడా చెందారని తెలుస్తోంది. అంటే ఆ నీరు తాగడం ఎంత డేంజర్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. దీంతోపాటు రాష్ట్రంలో డెంగీ కేసులు కూడా 50 శాతం పెరిగాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ప్రాంతాల వారీగా ఈ వ్యాధుల సంఖ్యను ఇక్కడ చుద్దాం.
విరేచనాల(Gastroenteritis) వ్యాధితో..హైదరాబాద్లో 13,923 మంది, ఆదిలాబాద్లో 9496 మంది, మహబూబ్ నగర్లో 9263 మంది, సిద్దిపేటలో 8658 మంది, వికారాబాద్లో 6647, సంగారెడ్డి జిల్లాలో 6265, రంగారెడ్డిలో 5683 మంది, గద్వాల్ 5064 మంది, యాదాద్రిలో 4384 ఇలా మొత్తం 1,12,918 కేసులు నమోదయ్యాయి.
డెంగీ వ్యాధితో..హైదరాబాద్లో 1722 మంది, నల్గొండలో 137, ఖమ్మంలో 122 మంది, మహబూబ్ నగర్లో 86 మంది, వరంగల్లో 46 మంది
అయితే ఈ వ్యాధులు ఎక్కువగా సరఫరా అయిన కలుషిత నీరు తాగడం వల్లే వ్యాప్తి చెందుతాయని వైద్యులు(doctors) అంటున్నారు. మరోవైపు గతంలో కూడా సికింద్రాబాద్, చిలకలగూడ సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో లోపం కారణంగా దాదాపు 300 మంది వాంతులు, విరేచనాల గురించి అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. చింతబావి బస్తీలో కూడా అనేక మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.