»Indonesian Gym Trainer Died While Doing 210kg White Lift
Viral Video: జిమ్ ట్రైనర్ వెయిట్ లిఫ్ట్ చేస్తూ మెడ విరిగి మృతి
ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
Indonesian gym trainer died while doing 210kg white lift
Gym: ఇండోనేషియా(Indonesia)కు చెందిన బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(A social media influencer) జస్టిన్ విక్కీ(Justin Vicky) జిమ్ చేస్తు మరణించాడు. 33 సంవత్సరాల విక్కీ దాదాపు 210 కేజీల బరువుతో షోల్డర్ వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు చేతులు పట్టు తప్పడంతో వెయిట్ ఉన్న రాడ్ తన మెడపై పడింది. ఆ క్రమంలో తాను వెయిట్ ఎత్తే క్రమంలో చేతుల నుంచి బరువు కాస్తా మెడపైకీ జారీంది. దీంతో మెడ విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన జిమ్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు గుండె, లంగ్స్ నరాలు తీవ్రంగా దెబ్బతినడంతో మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్యారడైజ్ బాలీ జీమ్ సెంటర్లో జస్టిన్ విక్కీ వ్యాయామం చేస్తున్న వీడియో గమనిస్తే తనకు సపోర్ట్‌గా వెయిట్ మెయింటెన్ చేయడాని ఒక వ్యక్తి ఉన్నప్పటికీ ఇంత దారుణం జరగడం నెటిజన్లకు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. నిజానికి తాను ఆ బరువుతో పైకి లేవాలి. కానీ అది అతని సాధ్యం కాలేదు. వెంటనే కింద కూలబడ్డాడు. అదే సమయంలో ఒక్క సారిగా ఆ రాడ్ అతని మెడపై పడింది. వెంటనే అతన్ని అసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతని మెడ విరగడంతో పాటు, గుండె, ఊపితిత్తులకు సంబంధించిన నరాలు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. జిమ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలని అందరికి చెప్పే జిమ్ ట్రైనర్ ఇలాంటి పరిస్థితిలో మరణించడంతో ప్యారడైజ్ బాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి పోస్ట్ పెట్టారు. జస్టిన్ విక్కీ కేవలం జిమ్ ట్రైనర్ మాత్రమే కాదు. మంచి మోటివేషనల్ పర్సన్ అని పలువురు పోస్ట్ చేస్తున్నారు. చుశారా కదా. జాగ్రత్త జిమ్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి.