గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తాజ్ మహల్ కట్టడంలోకి యమునా నది వరద నీరు చేరింది. అయితే వరద నీరు వల్ల తాజ్ మహల్ కు ఎటువంటి ముప్పు లేదని అధికారులు ప్రకటించారు.
వైవిధ్యభరిత కథాంశాలతో తమిళ హీరో విజయ్ ఆంటోని సినిమా చేసుకుంటూ పోతున్నాడు. గతంలో ఆయన నటించిన బిచ్చగాడు, బిచ్చగాడు2 వంటివి మంచి హిట్స్‌గా నిలిచాయి. తాజాగా ఆయన హత్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఓ కారులో 24 మంది స్టూడెంట్స్ ను పశువుల్లా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించే ఈ ప్రయాణం నేరం అంటూ తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు.
షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అలాగే వీటిని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అనే విషయాలపై డాక్టర్ సీఎల్ వెంకట్ రావు చక్కటి వివరణ ఇచ్చారు.
బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకం సృష్టించారు. అదే పార్టీకి చెందిన కార్యకర్తతోపాటు అతని ఫ్యామిలీపై దాడి చేశారు. ఆ క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్‌ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
పిల్లలు చూస్తుండగానే వారి తల్లి అలల్లో కొట్టుకుపోయింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.