తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం నాటి వరదల కారణంగా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వాగు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా పొరుగున ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందినవారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరొకరు కొండాయి సర్పంచ్ సమీప బంధువైన సమ్మక్కగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారు త...
మన ఇంట్లోకి సాధారణంగా ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా లేదా ఇతర జంతువులు వచ్చినా కూడా పెంచుకునే శునకాలు అప్రమత్తంగా ఉంటాయి. యజమానులు వచ్చే వరకు లేదా అవి బయటకు పోయే వరకు అరుస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటివల ఓ ఇంట్లోకి ఏకంగా చిరుతపులి వచ్చింది. దాన్ని చూసిన శునకాలు బెదిరిపోకుండా అరుపులు చేస్తూ అది పారిపోయే వరకు వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
సాయి ధరమ్ తేజ, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఓవర్సీస్‌లో సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మూవీ బాగుందని చెబుతున్నారు.
డ్రైవర్ లేని కారును మైనస్ జీరో అనే స్టార్టప్ కంపెనీ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని వీధుల్లో ఈ కారు ప్రత్యక్షం అవ్వడంతో స్థానికులు వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి మద్యం మత్తులో అటవీ ప్రాంతంలో పడుకుండిపోయాడు. ఆ సమయంలోనే ఓ నాగుపాము ఆ వ్యక్తి చొక్కాలోకి చేరింది. మత్తు నుంచి తేరుకున్నాక తన పొట్టపై పామును చూసి ఆ వ్యక్తి హడలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.