యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) రాబోయే యాక్షన్ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(GangsofGodavari) టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని లుక్లో క్రేజీగా కనిపిస్తున్నారు.
పలువురు యాపిల్(apples) రైతులు యాపిల్స్‌ను కాలువలో కుప్పులు కుప్పులుగా పడేస్తున్నారు. ఎంటని ఆరా తీస్తే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రోడ్ల పనులు ఆటంకంగా మారాయని వాపోయారు. అనేక రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో యాపిల్స్ పాడైపోతున్నాయని, అందుకే పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్(Baby Mega Cult Celebrations) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అతిథిగా వచ్చిన క్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార...
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
మీరెప్పుడైనా మూడు కళ్లు ఉన్న ఎద్దును ఎక్కడైనా చుశారా? చాలా అరుదు అనే చెప్పవచ్చు. అంతేకాదు ఆ ఎద్దుకు కొమ్ములు కూడా మూడే ఉండటం విశేషం. దానిని చూసిన అక్కడి స్థానికులు పరమశివుడి అవతారంగా భావిస్తూ మొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా కోబ్రా తిరుగుతోంది. ఓ రైతు కంట పడటంతో ఆ పాము ఒక్కసారిగా ఎటాక్ చేసింది. స్థానికులు అలర్ట్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత 13 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల సోనియా గాంధీ ఇంటికి వచ్చిన హర్యానా మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.