»Two Days Holiday For All Educational Institutions Due To Heavy Rains In Andhra Pradesh
AP Rains: ఏపీలో కూడా స్కూళ్లకు సెలవులు..వర్షాలతో నీట మునిగిన గ్రామం
గత రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నాయి. విద్యార్థుల దృష్ట్యా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Two days holiday for all educational institutions due to heavy rains in Andhra Pradesh
Holidays: గత కొన్ని రోజులుగా దేశమంతటా విస్తార వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఇక బంగాళఖాతంలో అల్పపీడనం(Bangalakhatam Low pressure) బలపడడంతో ఏపీలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కుమ్మరిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో స్కూళ్లు(Schools), కాలేజీల(Colleges)కు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, ఏపీ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్(NTR), విశాఖ(Vishakapatnam), నంద్యాల(Nadyala) జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
అలాగే ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెంతో పాటూ పలు మండలాల్లో స్కూళ్లకు కూడా రెండు రోజుల పాటూ సెలువులు ఇచ్చారు. నంద్యాలలో నాలుగు రోజుల పాటూ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. దీనితో పాటు జులై 29 శనివారం మొహర్రం పండుగ ఉంది దీనికి సెలవు ఉంటుంది. అలాగే ఆదివారం మొత్తం నాలుగు రోజులు సెలవులు ఉండడంతో తల్లిదండ్రులకు ఒక వైపు ఆందోళనలు మొదలయ్యాయి. వర్షాలు కురుస్తుండడంతో చెరువు, బావులు నిండుకుండలా మారాయి. పిల్లలు సరదాకోసం,నీళ్లను చూడడానికి వెళుతుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని అలాగే అవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని విజ్ఙప్తి చేసింది.
వైజాగ్లో వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతొంది. కార్లు నీట మునిగాయి. జనజీవనం స్థంభించిపోయింది.
నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయని బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్డీపీఎస్ అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలతో విశాఖ నగరంలో పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం