»The Water Flowing From The Top Of The Kadem Project The Officials Have Evacuated The Lower Areas People
Kadem project: పైనుంచి ప్రవహిస్తున్న నీరు..దిగువ ప్రాంతాలు ఖాళీ చేయించిన అధికారులు
తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు సామర్థ్యానికి మించి వరద ప్రవాహం(flood water) వస్తోంది. పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో 14 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. మరో 4 గేట్లు మొరాయించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా, 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీంతోపాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ డ్యామ్ పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్ (FRL) 700 అడుగులు ఉండగా అంతకు మించి వరద ప్రవాహం వస్తుంది. భారీ వరదల కారణంగా కడెం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరికొంత మంది అయితే పరిస్థితి మానవ నియంత్రణకు మించి ఉందని అంటున్నారు.