»In The Papikondalu Forest Area Water Comes Abundantly From The Nallamadi Tree
Nallamadi Tree:నల్లమద్ది చెట్టు నుంచి ధారాళంగా నీరు.. వీడియో వైరల్
కొలాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో ఒక చెట్టునుంచి నీరు అలా వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. భూమి నుంచి జలధార వస్తుండడంతో చూసేవారిని ఆ దృష్యం ఆకట్టుకుంది.
In the Papikondalu forest area, water comes abundantly from the Nallamadi tree
Nallamadi Tree: బోరువేస్తే నీరు ఎలా ఉబికి వస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఒక చెట్టు నుంచి నీరు రావడం ఎప్పుడైనా చూశారా. కొలాయి తిప్పితే వాటర్ వచ్చినట్లు ఒక చెట్టు నుంచి ధారాళంగా నీరు వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాపికొండలు పరిధిలో కింటుకూరు అటవీ ప్రాంతంలో ఈ తాజా సంఘటన చోటుచేసుకుంది. ఆ అటవి ప్రాంతలో ఓ నల్లమద్ది చెట్టు నుంచి నీరు జలధారగా వస్తుంది. అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించిన అటవీశాఖ అధికారులకు నల్లమద్ది చెట్టు దర్శనం ఇచ్చింది. అయితే దీని గురించి ముందే తెలిసిన అధికారులు దాని నుంచి వచ్చే నీరు కోసం కత్తితో చెట్టుకు రంధ్రం చేశారు.
దీంతో చెట్టు లోపలి నుంచి కుళాయి తిప్పినట్టు నీరు బయటికి వచ్చింది. ఈ దృశ్యాన్ని అధికారులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలల్లో వైరల్గా మారింది. ఈ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఇది వింతేమి కాదని, అటవి ప్రాంతంలో నివసించే వారికి, అధికారులకు తెలిసిన విషయమే అంటున్నారు. ఇలా నీరు రావడం అనేది నల్లమద్ది చెట్టుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అలాగే నల్లమద్ది చెట్టు కాండం కూడా మార్కెట్లో చాలా ఖరీదు ఉంటుంది. చాలా ఏపుగా పెరగడం, దాని కొమ్మలు కాండం చాలా దృఢంగా ఉండడం ఈ చెట్టు ప్రత్యేకత.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an