KMM: మధిర పట్టణానికి చెందిన శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఆదివారం కొత్తగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సెలక్షన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ అంజన బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.