NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో సోమవారం నాడు గ్యార్మీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. గ్యార్మీ వేడుకల్లో భాగంగా మహబూబ్ సుభాని గంధోత్సవాన్ని గ్రామంలో ఊరేగించి దర్గా వద్దకు తీసుకువచ్చారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.