NRML: పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులు అధిక సంఖ్యలో హాజరై బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.