అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, కమలా హారిస్ ప్రచారం జోరు మీద ఉంది. ఈ నేపథ్యంలో వీరి ప్రచారంపై చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్, హారిస్ ఫోన్ కమ్యూనికేషన్లతో పాటు ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల ఫోన్లను చైనా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలిపాయి. సున్నితమైన సమాచారాన్ని దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాయి.