TG: పోలీసుల నిర్లక్ష్యంతోనే గంగారెడ్డి హత్య జరిగిందని కాంగ్రెస్ నేత మదుయాష్కీ అన్నారు. MLC జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులు గంగారెడ్డికి భద్రత ఇవ్వకపోగా హేళనగా మాట్లాడారు. ప్రాణానికి ముప్పు ఉందన్నా పట్టించుకోలేదు. పాత కక్షలంటూ తేలిగ్గా తీసుకున్నారు. గంగారెడ్డి హత్యపై DGPని కలిసి ఫిర్యాదు చేస్తాం’ అని పేర్కొన్నారు.