కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆయన వెంట సొగనూరు భీమిరెడ్డి ఉన్నారు.