AP: జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అని వైఎస్ షర్మిల వెల్లడించారు. సుబ్బారెడ్డి ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని పేర్కొన్నారు. తాను చెబుతున్నది నిజమని ప్రమాణం చేస్తా.. సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్కు మానవత్వం లేదా అని నిలదీశారు. తనకు, తన బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.