TG: ఏఐసీసీ అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మల్లికార్జున ఖర్గేకి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అంకితభావం, దార్శనికత మన జాతి భవిష్యత్తును రూపొందించడంలో కీలకం. అట్టడుగు వర్గాలకు మీరు నిజమైన ఛాంపియన్. మీ నిరంతర కృషి పట్టుదల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఊతమిస్తోంది. మీరు ఇలాగే ఎన్నో సంవత్సరాలు విజయం సాధించి దేశానికి సేవ చేయాలి’ అని కోరుకుంటున్నట్లు చెప్పారు.