ప్రభుత్వ సంస్థ BSNLకు కొన్ని నెలలుగా సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగుతున్నట్లు కంపెనీ తెలిపింది. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్టెల్ 17 లక్షలు, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయారు. ఆగస్టులో కూడా BSNL 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ కాలంలో జియో 40 లక్షలు, ఎయిర్టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.