ప్రభుత్వ రంగ బ్యాంకు SBI గుజరాత్లోని సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ సోలెక్స్ ఎనర్జీ మధ్య కీలక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్లకు సోలార్ ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడానికి SBIతో జతకట్టినట్లు సోలెక్స్ ఎనర్జీ ప్రకటనలో తెలిపింది. సూర్యశక్తి ఫైనాన్స్ పథకం కింద రూ.10 కోట్ల రుణాలు ఇవ్వనుందని పేర్కొంది. సౌరశక్తిని తక్కువ ధరకు తీసుకొచ్చేందుకు, వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని సోలార్ కంపెనీ MD తెలిపారు.