తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవిని మనం వెండితెరపై మాత్రమే చూసి ఉంటాం. కానీ ఆయన వెండితెర కంటే ముందే నటుడుగా, నాట్యకారుడిగా కూడా ఎన్నో ప్రదర్శనలు చేశారు. తాజాగా ఒక అరుదైన ఫోటోను ‘X’లో షేర్ చేశారు. ‘నర్సాపూర్లోని వైఎన్ఎం కాలేజీలో కోన గోవింద రావు రచించిన నాటకంలో నటుడిగా గుర్తింపు వచ్చింది..నేటికి 50 సంవత్సరాల నట ప్రస్థానం పూర్తయ్యింది’ అని రాసుకొచ్చారు.